పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

దామెర : అమరుడు చిరంజీవి పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎంసీపీఐ (యూ) కేంద్ర కమిటీ సభ్యుడు గోనె కుమారస్వామి అన్నారు. మండలంలోని తక్కళ్లపహాడ్‌లో గురువారం చిరంజీవి వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో చిరంజీవి చేసిన సేవలను కొనియాడారు. గ్రామాభివృద్ధితో పాటు అవినీతి అక్రమాలను వెలికితీయడంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. విద్యావ్యతిరేక విధానాలపై నిరంతం పోరాటం సాగించాడని వెల్లడించారు. ప్రజా సమస్యలపై జూన్‌ 1 నుంచి 7 వరకు నిర్వహించ తలపెట్టిన ప్రజా ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్‌రెడ్డి హంసరెడ్డి, సహాయ కార్యదర్శి నీల రవీందర్‌, ఏఐఎఫ్‌డీఎస్‌ రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ మాస్‌ సావిత్రి, కార్యవర్గ సభ్యులు కర్ర రాజిరెడ్డి, చీపురు ఓదయ్య, ఎండీ ఉస్మాన్‌, వక్కల కిషన్‌, మంద భద్రయ్య, రమేష్‌, బండారి మమత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement