అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలి

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

దామెర : గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు సమష్టిగా పనిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికై న దుబాసి నవీన్‌ గురువారం ధర్మారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవీన్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అన్నారు. నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దాడి వసంతరమేష్‌, పెండ్లి రాజు, వడ్డెపల్లి చంద్రు, తోట రజితశ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement