హామీ నెరవేర్చిన సర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

హామీ నెరవేర్చిన సర్పంచ్‌

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

వేలేరు : సర్పంచ్‌గా గెలిస్తే గ్రామంలో పుట్టే ప్రతి ఆడపిల్లకు తన సొంత డబ్బులు రూ.5,016లు ఇస్తానని సర్పంచ్‌ జక్కల మౌనిక హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామానికి చెందిన ఎండీ సమ్రీన్‌–సమీర్‌ దంపతులకు ఆడపిల్ల జన్మించగా గురువారం వారి ఇంటికి వెళ్లి నగదు అందజేసి హామీ నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్తులు తమపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించారని, వారి నమ్మకాన్ని కాదనకుండా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని అన్నారు. బక్రీద్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంపత్‌, వార్డు సభ్యులు ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

శాయంపేట: బోధన చేస్తున్న ముస్లిం మతపెద్ద

Advertisement
 
Advertisement
Advertisement