వృద్ధురాలి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి అదృశ్యం

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

కాజీపేట: కాజీపేట 63వ డివిజన్‌ అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన వృద్ధురాలు అయిల సరోజన (60) మూడ్రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరోజన తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త సంపత్‌ ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌ ఆదేశాల మేరకు ఎస్సై తాళ్లపల్లి యాదగిరి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సరోజన వివరాలు తెలిస్తే 87126 83765, 87126 85008 నంబర్లలో సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement