● ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు
ఐనవోలు : త్యాగం, సేవాభావానికి ప్రతీక బక్రీద్ అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. గురువా రం మండల కేంద్రంలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి పరస్పర ప్రేమాభిమానాలతో జీవించాలనే గొప్ప సందేశాన్ని పర్వదినం అందిస్తోందన్నారు. హజ్రత్ ఇబ్రహీం చూపిన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతీ ఒక్కరు సేవా దృక్పథంతో సమాజానికి ఉపయోగపడేలా జీవించాలని పిలుపునిచ్చారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు బక్రీద్‌ను జరుపుకున్నారు.
శాయంపేట : త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ను ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో మతపెద్ద అబ్దుల్లా, ముస్లింలు రాజ్ మహ్మద్, అంకూషావళి, కమురుద్దీన్, జానీసైదా, షారుఖ్ ఖాన్, జమాల్, కరీముల్లా, రఫీ, షఫీ, ఉస్మాక్, సల్మాన్ ఖాన్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం బక్రీద్‌ను ముస్లింలు జరుపుకున్నారు. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు.
ఎల్కతుర్తిలో..
ఎల్కతుర్తి : త్యాగం, విశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా ముస్లింలు గురువారం బక్రీద్‌ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు సూరారంలో ముస్లింలు బక్రీద్‌ను జరుపుకున్నారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
కమలాపూర్‌లో..
కమలాపూర్ : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ముస్లింలు గురువారం బక్రీద్‌ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ముస్లింలు ప్ర త్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తె లుపుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక ముస్లింలు పాల్గొన్నా రు.
పరకాలలో..
పరకాల : పరకాల పట్టణంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో గురువారం బక్రీద్‌ను జరుపుకున్నారు. పరకాల బస్టాండ్ సమీపంలోని ఈద్గాలో సాముహిక ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగ విశిష్ఠతను వివరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డితో పాటు స్థానిక కౌన్సిలర్లు పాల్గొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ త్యాగం, కరుణ, సోదర భావం నిండిన పవిత్ర పండుగ అని కొనియాడారు. స్వార్థాన్ని త్యజించి శాంతి సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరారు. టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీనుతో పాటు, ముస్లింలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


