మురుగు నీటిలోనే గేట్‌వాల్వ్
శాయంపేట : గ్రామంలో ఎక్కడ చూసిన పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు పక్కన మురుగు నీరు చేరి దుర్వాసన వెదజల్లుతుంది. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
నినాదాలకే పరిమితం..
మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో పారిశుద్ధ్యంపై అధికారులు, పంచాయతీ పాలకులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నా.. అది ఎక్కడా అమలు కా వడం లేదు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నినాదాలకే పరిమితమైందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గ్రామంలోని దళితకాలనీ పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు వెళ్లేందుకు సరైన కాల్వ లు లేవు. దీంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
గేట్‌వాల్వ్ లీకేజీ..
గ్రామస్తులకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన గేట్‌వాల్వ్ లీకేజీ అయింది. దీంతో దాని చుట్టూ మురుగు చేరి అస్తవ్యస్తంగా తయారైంది. గేట్‌వాల్వ్‌లో మురికి నీరు పేరుకుపోతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయడం లేదనే స్థానికులు చెబుతున్నారు. జీపీ సిబ్బంది గేట్‌వాల్వ్ ఆన్ చేసినప్పుడు పైపులోకి మురుగు నీరు వెళ్లి ప్ర జలు తాగేనీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది.
పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు
గ్రామంలోని రోడ్డు పక్కన ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర వ్యర్థాలు విచ్చలవిడిగా పడేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి ప్రయాణికులకు, స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై న గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, పాలకవర్గం పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పేరుకుపోయిన ప్లాస్లిక్ వ్యర్థాలు
పట్టించుకోని పాలకులు, అధికారులు


