నడికూడ : పంట వ్యర్థాలను కాల్చొద్దని పరకాల ఏసీపీ సతీష్‌బాబు రైతులను కోరారు. ప్రమాదవశాత్తు పంట అవశేషాలకు మంటలు అంటుకొని మంటలు చెలరేగిన ఘటన దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణపూర్ గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామ శివారులోని పంట పొలాల్లో మిగిలిన వ్యర్థాలకు మంటలు అంటుకొని వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఫైర్ ఇంజన్‌తో పాటు స్థానిక వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. సంఘటన స్థలానికి పరకాల ఏసీపీ సతీష్‌బాబు పరిశీలించి మాట్లాడారు. గత ఏడాదిలో జరిగిన ప్రమాదంతో పాటు ఇటీవల పంట అవశేషాలు దగ్ధమవుతుండగా పొగ కారణంగా ప్రమాదం జరిగిందని, అవశేషాలను కాల్చే బదులు పొలంలో కలియ దున్నడం వల్ల భూమి సారవంతం అవుతుందన్నారు. పంట వ్యర్థాలు కాల్చడం వల్ల దట్టమైన పొగతో శ్వాసకోశ సమస్యలు వస్తాయని, ఇప్పటికై నా రైతులు పంట అవశేషాలను కాల్చకుండా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై పరమేశ్వర్, ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
పరకాల ఏసీపీ సతీష్‌బాబు


