సమర్థంగా విధులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

సమర్థంగా విధులు నిర్వహించాలి

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

సమర్థంగా విధులు నిర్వహించాలి పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్‌ ‘ఆలయ భూమి కబ్జాకు కుట్రలు’ ఆర్థిక సాయం అందజేత రంగనాథస్వామికి పంచామృతాలతో అభిషేకం ఆలయ కమిటీ చైర్మన్‌కు సన్మానం మజ్జిగ పంపిణీ

వరంగల్‌ క్రైం: అప్పగించిన పనులను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్‌స్పెక్టర్లు దేవేందర్‌, హరికృష్ణ బుధవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖ కీర్తిప్రతిష్టలు అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయన్నారు. విధి నిర్వహణలో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు.

కాశిబుగ్గ: పేద వర్గాల ఆరోగ్య రక్షణ కోసం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటోందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. ఈ మేరకు రూ.50 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు వరంగల్‌ తూర్పులోని ఓసిటీ క్యాంపు కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సీఎం ఫండ్‌ ద్వారా చికిత్స చేయించుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సహాయ నిధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కువ నిధులు కేటాయిస్తూ పేదలకు ఆదుకుంటున్నారని తెలిపారు.

హన్మకొండ: అల్లుడి హోటల్‌ కోసం న్యూశాయంపేటలోని శ్రీ భక్తాంజనేయ ఆలయ భూమిని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు. హనుమకొండ వడ్డేపల్లిలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేశా, పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో మద్యపాన నిషేధ సమయంలో పక్క రాష్ట్రాల నుంచి ప్లాస్టిక్‌ బాటిళ్లలో ఏం తెప్పించావో గుర్తు చేసుకో.. అప్పుడు నీ వెంట పోలీసులు పడితే తప్పించుకొని వడ్డేపల్లిలోని మన కామన్‌ ఫ్రెండ్‌ చిన్నాను పట్టుకొని మా అన్న దగ్గరికి వచ్చిన విషయం మర్చిపోయావా.. అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తే ఖబడ్డార్‌ అని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. ఆయనకు అండగా ఉంటామన్నారు.

హసన్‌పర్తి: ఇటీవల మరణించిన 65వ డివిజన్‌ ఎల్లాపురానికి చెందిన మిద్దెల చిలుకమ్మ కుటుంబానికి జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్‌ గౌడ్‌ ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు బాధితురాలి ఇంటికి బుధవారం వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. తొలుత మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుదర్శన్‌, నాయకులు సురేష్‌, క్రాంతి, శ్రీనివాస్‌ రెడ్డి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

కాశిబుగ్గ: వరంగల్‌ కాశిబుగ్గలోని రంగనాథ స్వామికి పంచామృతాలతో బుధవారం అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ గోషికొండ శకుంతల సుధాకర్‌, ధర్మకర్తలు నీలం అరుణ, పల్లకొండ రాజమణి, మేడుకుర్తి లోకేష్‌, రేణుక, పిట్టల కోటేశ్వర్‌, రిటైర్డ్‌ తహసీల్దార్‌ కుసుమ సత్యనారాయణ, కట్కూరి సత్యనారాయణరెడ్డి దంపతులు, ఆలయ మాజీ కో కన్వీనర్‌ ఆకెన వెంకటేశ్వర్లు, తలకోటి రమేష్‌ పాల్గొన్నారు.

కాశిబుగ్గ: వరంగల్‌ తూర్పు ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావును స్థానిక సీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ దాసరి రాజేష్‌ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను మురళి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

నయీంనగర్‌: కొత్తూర్‌ రోడ్డులోని దేవా ఫొటో స్టూడియో ప్రారంభించి 25 ఏళ్లు అయిన సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు బోనగాని యాదగిరి గౌడ్‌, ఫొటోగ్రాఫర్‌ దేవా కలిసి మజ్జిగ పంపిణీ చేశారు. మెరుగు వినోద్‌, శంకర్‌, శ్రీనివాస్‌, కుమార్‌, వీరస్వామి, రమేష్‌, సదానందం, సంజీవ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement