స్వదేశీ వస్తువులనే వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

స్వదేశీ వస్తువులనే వినియోగించాలి

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

విద్యారణ్యపురి: స్వదేశీ వస్తువులనే వినియోగించుకోవాలని స్వదేశీ జాగరణ మంచ్‌ రాష్ట్ర బాధ్యుడు కంది శ్రీనివాస్‌రెడ్డి కోరారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌లో టీటీసీ శిక్షణ పొందుతున్న మహిళలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేస్తే తమ రూపాయి బలపబడుతుందని చెప్పారు. బహుళజాతి సంస్థల ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన సూచించారు. స్వదేశీ వస్తువులనే వినియోగించుకోవాలని కోరుతూ రూపొందించిన కరపత్రాలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్‌ నాయకులు, తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ్‌ గురిజాల రవీందర్‌, హనుమకొండ జిల్లా కన్వీనర్‌ మంద ప్రకాశ్‌, యూత్‌ ఇన్‌చార్జ్‌ శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement