కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

హసన్‌పర్తి: ఇటీవల విధుల్లో నుంచి తప్పిన తమను వెంటనే తిరిగి తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎల్‌పీసీ కంపెనీ ఎదుట బుధవారం బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా కంపెనీల్లో పనిచేస్తున్న 30మంది కార్మికులను తొలగించి, ఒడిశాకు చెందిన కార్మికులతో పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి తీసుకోకుంటే ఆందోళన చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పుల్లా రవీందర్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి, నాయకులు సునీల్‌, లక్ష్మారెడ్డి, గరిగె రాజు, ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement