హాకర్స్‌ జోన్లు ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

హాకర్స్‌ జోన్లు ఏర్పాటు చేయండి

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

వరంగల్‌ చౌరస్తా: ఏళ్ల తరబడి కాలంతో సంబంధం లేకుండా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరువ్యాపారులను రోడ్డుపాలు చేయొద్దని చిరువ్యాపారుల సంఘం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గజ్జెల లింగమూర్తి కోరారు. ఈ మేరకు హాకర్స్‌ జోన్లు ఏర్పాటు చేసి ఉపాధి చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల కూల్చివేతల్లో భాగంగా వరంగల్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ సెంటర్‌, సీకేఎం ఆస్పత్రి లేన్‌లో చిరువ్యాపారాలను బల్దియా అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పోషణ కోసం ఆరాటపడుతూ బతుకుతున్న చిరు వ్యాపారులను భయబ్రాతులకు గురిచేస్తూ ఉపాధిని దెబ్బతీయడం బాధాకరమని వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement