మామునూరు: బక్రీద్ పర్వదినాన్ని శాంతియుతంగా, మత సామరస్యంగా జరుపుకోవాలని ముస్లింలకు ఏనుమాముల ఇన్‌స్పెక్టర్ జవ్వాజి సురేష్ సూచించారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలు, మామునూరు ఏసీపీ వెంకటేష్ సూచనల మేరకు వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో ముస్లిం మతపెద్దలతో పీస్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ గురువారం జరగనున్న బక్రీద్ పర్వదినంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులకు సహకారం అందించాలని కోరారు.


