● మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
హసన్‌పర్తి: అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అన్నారు. పెద్ద చెరువు వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బీజేపీ ప్రతినిధి బృంద సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అరంతరం కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ చెరువు మూలమలుపు నుంచి ఇటు హసన్‌పర్తి తహసీల్దార్ కార్యాలయం వరకు, అటు సీతంపేట క్రాస్ వరకు రోడ్డును విస్తరించి డివైడర్లతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కమీషన్ల కోసం పనుల్లో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.
‘సర్’కు ప్రజలు సహకరించాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు ప్రజలు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కోరారు. అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. ప్రతీ ఓటరుకు న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, సర్పంచ్ కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్‌రావు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రాంచంద్రారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్, నాయకులు తాళ్ల రమేష్, రాజు, శ్రీకాంత్, ఇమ్మడి కర్ణాకర్, శోక్, రవీందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


