నిబంధనల మేరకే పుస్తకాలు విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనల మేరకే పుస్తకాలు విక్రయించాలి

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

వడుప్సా జిల్లా అధ్యక్షుడు సతీష్‌కుమార్‌

విద్యారణ్యపురి: నిబంధనల మేరకే ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు విక్రయించాలని వరంగల్‌ డిస్ట్రిక్ట్‌ అన్‌ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాదాల సతీశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎమ్మార్పీకి మించి పుస్తకాలను విక్రయించకూడదని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలకు లేఖ జారీచేశారని తెలిపారు. హనుమకొండలోని ఓప్రైవేట్‌ పాఠశాలలో బుధవారం నిర్వహించిన వడుప్సా జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. యాజమాన్యాలు నియమ నిబంధనలు పాటించకపోతే జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని గుర్తించాలన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఎవరికి ఇవ్వకూడదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌ ఇటీవల ఓ సర్క్యూలర్‌ జారీచేశారని వెల్లడించారు. ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి నెదురుగొమ్ముల రమేశ్‌, వడుప్సా హనుమకొండ జిల్లా కార్యదర్శి జ్ఞానేశ్వర్‌, కోశాధికారి ముక్తీశ్వర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రామినేని రాజేశ్‌కుమార్‌, హసన్‌పర్తి జోన్‌ అధ్యక్షుడు ఎ.రాంబాబు, హనుమకొండ జోన్‌ కోశాధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement