పేదలకు మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

కమలాపూర్‌ : వైద్యులు, సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సర్పంచ్‌ పబ్బు సతీశ్‌ సూచించారు. కమలాపూర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈసీజీ మిషన్‌కు పేపర్‌ రోల్‌ లేకపోవడంతో గుండె సంబంధిత పరీక్షలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ పబ్బు సతీశ్‌ స్వయంగా రెండు పేపర్‌ రోల్స్‌ తెప్పించి బుధవారం వైద్యాధికారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు చిన్న చిన్న కారణాలతో వైద్య పరీక్షలు నిలిచిపోయే పరిస్థితి రానివ్వొవద్దని వైద్యాధికారులను కోరారు. ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రి బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement