ఎల్కతుర్తి : పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని స్థానిక ఎస్సై నరసింహారావు రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని సూరారం, గోపాల్‌పూర్, ఇందిరానగర్ గ్రామాల్లో ఏఓ రాజ్‌కుమార్‌తో కలిసి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. వరికొయ్యలు, వరిగడ్డి, పత్తికట్టె, మొక్కజొన్న చొప్ప ఇతర పంటవ్యర్థాలకు నిప్పు పెడితే గాలి ద్వారా ఇతర పంటలు, గ్రామాల్లోకి మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మల్చర్, శ్రడ్డర్ ఉపయోగించి పంటవ్యర్థాలను భూమిలోనే కలియదున్నుకోవాలన్నారు. ఏఈఓలు తిరుపతి, పూర్ణచందర్, బాబు తదితర రైతులు పాల్గొన్నారు.


