మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఆత్మకూరు / నడికూడ / దామెర : బాధిత కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ తరుఫున అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడు, నడికూడ, చౌటుపర్తి, నర్సక్కపల్లి గ్రామాలతో పాటు దామెర మండలంలో వడదెబ్బ, ఇతర కారణాలతో మృతిచెందిన ఎలుకటి మొగిలి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే మండల కేంద్రంలో మృతిచెందిన వీర్ల హారిక కుటుంబాన్ని, హౌజుబుజుర్గ్ గ్రామంలో షేక్ హుస్సేన్ కుటుంబాన్ని పరామర్శించారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తామన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, నాయకులు ఉన్నారు.


