నిత్యావసర సరుకుల అందజేత | - | Sakshi
Sakshi News home page

నిత్యావసర సరుకుల అందజేత

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

నిత్యావసర సరుకుల అందజేత పిడుగుపాటుతో ఆవు మృతి ఐదుగురి రీకాల్‌.. ఒకరి రిమాండ్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి

శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన అలవాల రాజు అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు అమ్మ అశోక్‌, పరకాల 9వ వార్డు కౌన్సిలర్‌ బెజ్జంకి పూర్ణాచారి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 50కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులను అందించారు. వారివెంట కృష్ణ, తిరుపతి, రామూర్తి, రాజ్‌కుమార్‌, తిరుపతి, కుమార్‌, రాజు, శంకర్‌ తదితరులు ఉన్నారు.

భీమదేవరపల్లి : పిడుగుపాటుతో పాడి ఆవు మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతు మారుపాటి యోగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం కురిసిన అకాల వర్షానికి పిడుగు పడటంతో సూమారు రూ.80 వేల విలువచేసే ఆవు మృతిచెందినట్లు తెలిపారు. పిడుగుపాటుతో ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టారు.

శాయంపేట : దొంగతనం కేసులో ఐదుగురికి రీకాల్‌, చీటింగ్‌ కేసులో ఒకరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్సై జక్కుల పరమేశ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలకు చెందిన జనగ్గండుల సుజాత, కందెల కల్యాణ్‌, కుంభం లక్ష్మి, కండేల కల్యాణి, అబ్బాపూర్‌కు చెందిన కలువాల గణేశ్‌లపై దొంగతనం కేసు నమోదు కాగా ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆలేరు మండలంలోని దిలవాలషాసూర్‌ గ్రామానికి చెందిన మచ్చ సత్యనారాయణపై 2020 సంవత్సరంలో చీటింగ్‌ కేసు నమోదు అయింది. బుధవారం పరకాల కోర్టులో వారిని ప్రవేశపెట్టగా కోర్టు వాయిదాలకు హాజరు కానందున జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ సాయిశరత్‌ ఐదుగురికి రీకాల్‌ చేసి సత్యనారాయణకు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

శాయంపేట : మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం జవహర్‌ లాల్‌ నెహ్రూ వర్ధంతిని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చురెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 17 ఏళ్లు దేశ ప్రధానిగా పనిచేసి ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పరిరక్షణ కోసం నెహ్రూ కృషిచేశారని కొనియాడారు. నవ భారతావనికి శాసీ్త్రయ దృష్టి కల్పిస్తూ శాస్త్ర, సాంకేతిక ప్రగతికి నెహ్రూ పునాదులు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చల్లా చక్రపాణి, డీసీసీ ఉపాధ్యక్షుడు పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రవి, డీటీ రెడ్డి, సాంబయ్య, కట్టయ్య. కుమారస్వామి, రాజు, శంకరాచారితో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement