నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని వినియోగించుకోవాలి

May 28 2026 12:28 AM | Updated on May 28 2026 12:28 AM

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

దామెర : మహిళ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. మండలంలోని ల్యాదెళ్లలో వీ–హబ్‌, సెర్ఫ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం ల్యాదెళ్ల నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో గల క్వార్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈనెల 31న మహిళా శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో భాగంగా మొదటి విడత మహిళలకు సారీ రోలింగ్‌, పిండి వంటల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అనంతరం మార్కెటింగ్‌ ఏ విధంగా చేయాలో తర్ఫీదునిచ్చి వ్యాపారంలో రాణించే విధంగా శిక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు సంఘటితంగా ముందుకు సాగుతూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ మేన శ్రీను, తహసీల్దార్‌ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓ గుమ్మడి కల్పన, పీఆర్‌ ఏఈ సమ్మిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌, మాజీ అధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, సర్పంచ్‌లు రవియాదవ్‌, రాజు, శ్రీనివాస్‌, ఏపీఎం అశోక్‌, స్థానిక నాయకులు, కార్యకర్తలు వీహబ్‌ ప్రతినిధులు, గ్రామస్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement