
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద
కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 177 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ.గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ లు రాథోడ్ రమేశ్, డాక్టర్ కె.నారాయణ, సీపీఓ సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
త్వరగా పరిష్కరించండి: వరంగల్ కలెక్టర్
న్యూశాయంపేట: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లు చెల్లించాలని రంగశాయిపేటకు చెందిన అందె ఝాన్సీ వినతిపత్రం అందించగా.. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో వర్తక సంఘం వినాయక చవితి పేరిట అక్రమంగా టెండర్ నిర్వహిస్తున్నారని, టెండర్ ఆపాలని జిల్లా హోల్‌సేల్, రిటైల్ కూరగాయల మార్కెట్ కమిటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందించింది. డీలర్లకు 5 నెలల నుంచి కమీషన్ చెల్లించడం లేదని వెంటనే చెల్లించాలని వరంగల్ రేషన్ డీలర్ల సంఘ సభ్యులు వినతి పత్రం అందించారు. అర్జీలు మొత్తం 151 అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు పుష్పలత, సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు