
వ్యాధులపై చైతన్యం కల్పించాలి
వరంగల్ అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కళాజాత ప్రదర్శనను మేయర్ సుధారాణితో కలిసి కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. కీటక జనిత, నీటి జనిత వ్యాధులు, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతపై గేయాలతో ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, సూపరింటెండెంట్ దేవేందర్, శానిటరీ సూపర్‌వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీను, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రకాశ్, భీమయ్య, అనిల్, సురేశ్ పాల్గొన్నారు.

వ్యాధులపై చైతన్యం కల్పించాలి