
నేషనల్ హైవే ఆఫీస్ ఫర్నిచర్ జప్తు చేయండి
నష్టపరిహారం చెల్లింపు కేసులో
కోర్టు ఆదేశం
కాజీపేట అర్బన్ : హనుమకొండ హంటర్‌రోడ్డులోని నేషనల్ హైవే ఆఫీస్ ఫర్నిచర్ జప్తు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జప్తు చేసేందుకు వచ్చిన కోర్టు సిబ్బందిని బుధవారం కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. కోర్టు సిబ్బంది కథనం ప్రకారం.. నేషనల్ హైవే 163 రోడ్డు కింద భూములు కోల్పోయిన పైడిపల్లి గ్రామానికి చెందిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్న నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీస్ మూవబుల్ ప్రాపర్టీని జప్తు చేయాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు సిబ్బంది ఆఫీస్‌లోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని జప్తు చేసేందుకు వెళ్లారు. వీరిని నేషనల్ హైవే ఆఫీస్ సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిపారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వెంకన్న వీఆర్ నుంచి దేవరుప్పుల పీఎస్, జి.శ్రీదేవి తరిగొప్పుల నుంచి వరంగల్ సీసీఎస్, ఎం.రాజు గీసుకొండ నుంచి ముల్క నూరు, ఎన్.సాయిబాబు ముల్కనూరు నుంచి వర్ధన్నపేట, బి.చందర్ వర్ధన్నపేట నుంచి టాస్క్‌ఫోర్స్, జి.అనిల్‌కుమార్ వీఆర్ నుంచి గీసుకొండ, టి.విజయ్‌రాజు వీఆర్ నుంచి గీసుకొండ, ఎం.కుమారస్వామి వీఆర్ నుంచి వరంగల్ ట్రాఫిక్, ఈ.రతీశ్ వీఆర్ నుంచి సీఎస్‌బీ వరంగల్, ఆనందం వీఆర్ నుంచి సీఎస్‌బీ వరంగల్, టి.యాదగిరి వరంగల్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్ వరంగల్, ఈ.నారయణ హనుమకొండ ట్రాఫిక్ నుంచి వీఆర్ వరంగల్‌కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ లీగల్: రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికై న 49 మంది జూనియర్ సివిల్ జడ్జిలను వివిధ జిల్లాలకు నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు జూనియర్ సివిల్ జడ్జిలను నియమించారు. వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (ఎకై ్సజ్ కోర్టు) జడ్జిగా రాజ్‌నిధి, నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జిగా ఊట్లూరి గిరిధర్, హనుమకొండ రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (పీసీఆర్ కోర్టు) జడ్జిగా బానావత్ అనూష, పరకాల మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు బొడ్డు శ్రీవల్లి శైలజ, ములుగు మొబైల్ కోర్టు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా దక్కన్నగారి మధులిక తేజ ను నియమించారు. ఈనెల 28లోపు బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు.
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం భూ సేకరణలో భాగంగా కన్సెంట్ అవార్డుకు ముందుకు వచ్చిన రైతుల బ్యాంకు ఖాతాలో రూ.34,84,05,298 జమ చేసినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధవారం తెలిపారు. 48మంది రైతుల ఖాతాల్లో జమయ్యాయని పేర్కొన్నారు. ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున 12 మంది రైతులకు, గాడేపల్లి గ్రామంలో 36 మంది రైతులకు భూ సేకరణ పరిహారం కింద డబ్బులు చెల్లించామని కలెక్టర్ వెల్లడించారు.