● గ్రూప్–1 టాపర్ తేజస్విని రెడ్డి
విద్యారణ్యపురి: ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి తేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమని గ్రూప్ –1 టాపర్ జిన్నా తేజస్విని రెడ్డి అన్నారు. మంగళవా రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో తేజ స్వినిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సరైన ప్రణాళికతో సొంతంగా నోట్స్ రాసుకోవాలన్నారు. పోటీ పరీక్షల్లో తమకు ఏ సబ్జెక్ట్‌పై ఆసక్తి ఉందో దానిపైపట్టు సాధించేలా అందుకు సంబంధించిన పుస్తకాలు చదవవాలన్నారు. శాస్త్ర,సాంకేతిక అంశాలపై శిక్షణ నిపుణలు చల్లా నారాయణరెడ్డి, ఆ కళాశాల ప్రిన్సిపాల్ జి. రాజారెడ్డి, వైస్‌ప్రిన్సిపాల్ కె. రజనీలత, స్టాఫ్‌సెక్రటరీ ఎం. రవికుమార్,కెరీర్ అండ్ గైడెన్స్‌సెల్ కోఆర్డినేటర్ బి.కవిత, డాక్టర్ చి న్నా మాట్లాడారు. అనంతరం తేజస్వినిరెడ్డిని ప్రిన్సి పాల్ రాజారెడ్డి ఇతర అధ్యాపకులు సన్మానించారు.
33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
● ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి
న్యూశాయంపేట : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం అంబాల స్వరూప అధ్యక్షతన హనుమకొండలో జరిగిన తెలంగాణ వ్యవసాయ మహిళా కూలీల జిల్లా సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కరువైందని తెలిపారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు కాకుండా బతుకు మార్చే విధానాలు తీసుకు రావాలని పేర్కొన్నారు. మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బి.పద్మ మాట్లాడుతూ మహిళా సాధికారత పేరుతో మాటలు చెబుతున్నారు తప్ప, ఆచరణలో లేదని విమర్శించారు. మనుధర్మ శాస్త్రం అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సదస్సులో నాయకులు బి.ప్రసాద్, జి.రాములు, వాసుదేవరెడ్డి, స్వరూప, రజిత, రమ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలో
488మంది గైర్హాజర్
విద్యారణ్యపురి : ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో మంగళవారం 55 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగగా అందులో 488 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. మొత్తంగా 18,946మంది విద్యార్థులకు గాను 18,458 మంది హాజరు కాగా 488 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
ప్రణాళిక ప్రకారం చదివితేనే విజయం