● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: స్వచ్ఛ సర్వేక్షణ్–24లో మెరుగైన ర్యాంకు సాధించేలా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఆదివారం నగరంలోని బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో, హనుమకొండ డీఈఓ కార్యాలయం వద్ద, అదాలత్ వద్ద టాయిలెట్లను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్–24లో నగరం మరో మారు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ సాధించేలా ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ ఉండాలన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లలో ఏమైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంహెచ్‌ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ చక్కని వేదిక అని, ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు.