మరిపెడ రూరల్: ఇద్దరు యువకులు గంజాయి విక్రయించడానికి వచ్చి మరిపెడ పోలీసులు పట్టుబడ్డారు. ఈ ఘటన ఆదివారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులో చోటు చేసకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన బానోత్ సింహాద్రి, జర్పుల సింహాద్రి బైక్‌పై గంజాయి విక్రయించడానికి మండలానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై వీరభద్రరావు ఆధ్వర్యంలో ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కిలో గంజాయితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుంది. అనంతరం ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పోలీస్ సిబ్బంది సాయికిరణ్, శ్రీనివాస్, గణేశ్, రవీందర్, రమేశ్‌ను ఎస్సై అభినందించారు.


