ఇంకా నిర్మాణంలోనే.. | - | Sakshi
Sakshi News home page

ఇంకా నిర్మాణంలోనే..

Mar 16 2026 8:39 AM | Updated on Mar 16 2026 8:39 AM

న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునఃర్విభజన ప్రక్రియ 2016లో అక్టోబర్‌ 11న (దసరా పండుగ రోజున) జరిగింది. అప్పటి వరకు ఉన్న పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంత రం మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను విభజిస్తూ వరంగల్‌ అర్బన్‌, వ రంగల్‌ రూరల్‌ జిల్లా, జనగామ, మహబూబా బా ద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలు గా విభజించారు. అనంతరం 2021లో వరంగల్‌ అర్బ న్‌ జిల్లాను హనుమకొండ, వరంగల్‌ రూరల్‌ జిల్లా ను వరంగల్‌ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన జరిగి ప దేళ్లు కావస్తున్నా.. కార్యాలయాలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జి ల్లా కార్యాలయాలు నగరంలోని విసిరి పారేసినట్టు ఉండటంతో ఏ పనికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజ ల్లో గందరగోళం నెలకొంది. వరంగల్‌ ఆజంజాహి మిల్లు మైదానంలో నూతనంగా కలెక్టరేట్‌ (ఇంటిగ్రేటెట్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌) నిర్మాణం పూర్తి కావస్తున్నా ప్రారంభానికి ముహూర్తం ఏప్పుడొస్తుందా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

రూ.80 కోట్ల అంచనాతో..

జిల్లా పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు, పరకాల నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఆజంజాహి మిల్లుకు చెంది న సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్‌ జీ ప్లస్‌ 2 నిర్మాణం చేపట్టారు. 2023 జూన్‌లో సుమారు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. సుమారు 40కి పైగా ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఒకే భవనంలో కొలువుదీరనున్నాయి. ఇప్పటివరకు నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్న రెవెన్యూ, వ్యవసాయ, విద్యా, వైద్య, సంక్షే మ, తదితర శాఖలన్నీ ఇకపై ఒకే భవనంలో ఉండనున్నాయి. విశాలమైన చాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్‌, మీటింగ్‌ రూమ్‌లు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌ హాల్స్‌తో ఈ భవనం హైటెక్‌ లుక్‌ సంతరించుకోనుంది. ఒకే కాంప్లెక్స్‌లో అన్ని పనులు పూర్తవుతాయి. పైగా ప్రజల ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా కానున్నాయి.

పురోగతిలో నిర్మాణ పనులు

ప్రస్తుత భవనానికి సంబంధించిన చివరి విడత పెయింటింగ్‌, విద్యుత్‌ పనులు పూర్తయ్యాయి. కా ర్యాలయాల్లో ఫర్నిచర్‌ బిగింపు, ఇంటర్నల్‌ సీసీ రో డ్లు, గ్రీనరీ పనులు, పార్కింగ్‌ షెడ్స్‌ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇక పనుల కోసం కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేకుండా మెట్టు దిగి తే ఆఫీస్‌, మెట్టు ఎక్కితే మరో ఆఫీస్‌ అన్నట్టుగా పా లన సాగనుంది. సకల సౌకర్యాలతో కలెక్టరేట్‌ నిర్మాణంతో పరిపాలన సవ్యంగా సాగనుంది.

మూడేళ్లయినా పూర్తికాని

వరంగల్‌ కలెక్టరేట్‌ పనులు

10 సంవత్సరాల నుంచి తాత్కాలిక అద్దె భవనాల్లోనే జిల్లా కార్యాలయాలు

ఇబ్బందులు పడుతున్న జిల్లా వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement