కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్.లింగమూర్తి అంత్యక్రియలు ఆదివారం హనుమకొండలోని పోచమ్మకుంటలో నిర్వహించారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.యాదగిరి, యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సదానందం, జనరల్ సెక్రటరీ వడ్డె రవీందర్, పలు విభాగాల పలువురు అధ్యాపకులు తదితరులు లింగమూర్తికి నివాళుల ర్పించారు. కాగా, లింగమూర్తి మృతి విద్యారంగం, విద్యార్థి ఉద్యమానికి తీరని లోటని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలీఉల్లాఖాద్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


