మంగళవారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2024 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2024

Jun 25 2024 1:14 AM | Updated on Jun 25 2024 1:14 AM

మంగళవ

మంగళవారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2024

రెవెన్యూ అధికారులు డబ్బులు చెల్లించింది ఈ రోడ్డు చుట్టూ ఉన్న ప్లాట్లు, రోడ్లకే..

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం కోసం భూసేకరణలో రెవెన్యూ అధికారులు కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దళారులు ప్రమేయంతో కొందరు రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టారు. అందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు తీసుకున్నట్లు అనేక ఉదంతాలు బహిర్గతమవుతున్నాయి. యాదాద్రి(భువనగిరి) నుంచి ఆరెపల్లి వరకు నిర్మించిన ఔటర్‌ రింగ్‌, బైపాస్‌ రోడ్డు భూసేకరణలో అక్రమాల ఖరీదు రూ.9.19 కోట్లు. ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ నిర్వాహకుడు, అధికారులు మిలాఖత్‌ అయ్యి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. విషయం బయటపడ్డాక అతనినుంచి ఆ నగదు వసూలులో తాత్సారం చేస్తున్నారు.

‘రియల్‌’ వెంచర్‌కు రూ.9.19 కోట్లు...

హసన్‌పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్‌ 353లో సుమారు 14.15 ఎకరాల భూమి ఉంది. ఈభూమి ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి 2006లో కొనుగోలు చేశాడు. వీటితోపాటు పక్కన మరికొంత భూమిని ఖరీదు చేశాడు. ఇందులో వెంచర్‌ చేసి సుమారు 673 ప్లాట్లుగా విభజించి అప్పటి మార్కెట్‌ ధర మేరకు ప్లాట్లు చేసి విక్రయించాడు. ఈ వెంచర్‌కు ‘కుడా’ ప్రొసీడింగ్‌ నంబర్‌ సీ1/2443/2006 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో ఈ వెంచర్‌లోని 14.15 ఎకరాల భూమిలో 4.30ఎకరాల భూమిని రింగ్‌రోడ్డు కోసం సేకరించినట్లు రెవెన్యూ అధికారులు రికార్డులు సృష్టించారు. ఈ విషయంలో ప్రభుత్వ మార్గ దర్శకాలకు మంగళం పాడారు. సర్వేనంబర్‌ 353లో 4.30 భూమిని సేకరించి, వెంచర్‌ నిర్వాహకుడికి గజానికి రూ.4 వేల చొప్పున 22,990 గజాలకు లెక్క కట్టి అప్పుడున్న తహసీల్దార్‌, ఆర్‌డీఓలు రూ.9,19,60,000లు నష్టపరిహారంగా చెల్లించారు. ఈ డబ్బులను అప్పుడున్న అధికారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కలిసి పంచుకున్నట్లు కలెక్టర్‌, సీఎస్‌ల వరకు ఫిర్యాదులు వెళ్లాయి. అందరూ కలిసి పంచుకున్నట్లు అసలు ప్లాట్లదారులు ఉన్నతాధికారుల ఫిర్యాదు చేసి ఏళ్లు గడుస్తున్నా విచారణ అంగుళం కూడా ముందుకు కదలడం లేదు.

కలెక్టర్ల దృష్టికెళ్లకుండా జాగ్రత్త..

రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌ ప్లాట్లు, రోడ్లు, గ్రీన్‌ల్యాండ్‌ను భూసేకరణ కింద చూపి అక్రమంగా రూ.9.19 కోట్లు చెల్లించిన రెవెన్యూ అధికారులు.. సదరు వ్యాపారిపై రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నా స్పందించడం లేదు. 2022–23 వరకు ఆర్డీఓగా ఉన్న అధికారి దృష్టికి రైతులు తీసుకెళ్లగా.. సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చామని, త్వరలోనే వసూలు చేస్తామని చెప్పినా అమలు కాలేదు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌లోనూ అప్పట్లో బాధితులు ఫిర్యాదు చేయగా.. అప్పుడున్న కలెక్టర్‌ను ఆర్డీఓ స్థాయి అధికారి ఒకరు తప్పుదోవ పట్టించారన్న ప్రచారం ఉంది. అధికారులు మారినప్పుడల్లా బాధితులు రూ.9.19 కోట్ల అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నా ఆర్డీఓ, తహసీల్దార్‌ స్థాయి అధికారులు కలెక్టర్లకు తప్పుడు సమాచారం ఇస్తూ దాటవేస్తున్నారని అంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా, వరంగల్‌ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం.. కచ్చితత్వం గల అధికారిణిగా పేరున్న కలెక్టర్‌ ప్రావీణ్య ఈ వ్యవహారంపై విచారణకు అదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.9.19 కోట్లు లూటీ చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఆర్‌ఆర్‌ యాక్టు ద్వారా డబ్బులు రికవరీ చేయాలని కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

మరికొన్ని ఘటనలు..

వరంగల్‌ పరిధిలో టెక్స్‌టైల్‌ పార్క్‌ భూసేకరణ ఓ అధికారికి కాసులవర్షం కురిపించిన వ్యవహారంపై వేసిన విచారణ కమిటీ నివేదిక బుట్టదాఖలైంది.

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం ఉనికిచర్ల శివారులో రామప్ప నుంచి ధర్మసాగర్‌ ట్యాంకు వచ్చే పైపులైన్‌ నిర్మాణం కోసం చేసిన భూసేకరణ కింద సమ్మిరెడ్డి అనే రైతుకు చెల్లించాల్సిన రూ.6,87,500లను రమేష్‌ అనే వ్యక్తి ఖాతాలో వేయడం అప్పట్లో వివాదస్పదమైంది.

భూసేకరణ పేరిట

ఖజానాకు ‘రెవెన్యూ’ లూటీ

ప్లాట్లు విక్రయించిన రియల్‌ వెంచర్‌కు రూ.కోట్లు ఇచ్చిన అధికారులు

భువనగిరి–ఆరెపల్లి హైవే బైపాస్‌లో అక్రమాలు

బయట పడ్డాకా నోటీసులతో

కాలయాపన

కలెకర్లను తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు

నాలుగేళ్లు దాటినా వసూలు చేయని రెవెన్యూ అధికారులు

మంగళవారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 20241
1/1

మంగళవారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2024

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement