గుంటూరు 57వ డివిజన్‌లో రిగ్గింగ్‌కు పాల్పడిని టీడీపీ మూకలు అడ్డుకున్న మేయర్ అభ్యర్థి శ్రీదేవి, మహిళా ఏజెంట్‌లపై దాడి నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి శ్రీదేవి
లక్ష్మీపురం: గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రం (లిటిల్ ఫ్లవర్ హై స్కూల్)లో ఉదయం నుంచి టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు యథేచ్ఛగా పోల్ చేశారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో దొంగ ఓట్ల నమోదును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ సీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నాయకులు పోలీసుల సమక్షంలో దాడి చేశారు. వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి భర్త ఆంజనేయులు, పార్టీ శ్రేణులు అక్కడకు రావడంతో పోలీసులు దాడి చేసిన టీడీపీ నాయకులను వదిలేసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఏజెంట్లపై లాఠీచార్జి చేశారు.
వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థిపై దాడి...
మధ్యాహ్నం తరువాత తిరిగి టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేయడం ప్రారంభించారు. సీఐ వంశీధర్ టీడీపీ నాయకులకు అండగా నిలిచారు. 57వ డివిజన్‌లోని బూత్ నంబర్ 5లో టీడీపీ శ్రేణులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి బూత్ వద్దకు చేరుకున్నారు. మహిళ అని కూడా చూడకుండా ఆమైపెన, వైఎస్సార్ సీపీ మహిళా ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారు. అసభ్య పదజాలంతో బూతులు తిట్టి బ్యాలెట్ బాక్స్‌ను కింద పడేశారు. దీంతో మేయర్ అభ్యర్థి శ్రీదేవి, మహిళా ఏజెంట్ నిరసనకు దిగారు. సమాచారం తెలుసుకున్న మేయర్ ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని జరిగిన ఘటనపై పూర్తి విచారణ నిర్వహిస్తామని చెప్పారు. తమకు ఇక్కడే ఇప్పటికిప్పుడే న్యాయం చేయాలని, రిగ్గింగ్‌కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ అభ్యర్థి శ్రీదేవి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బూత్‌లో కొద్దిసేపు పోలింగ్ సరళి నిలిచిపోయింది. అధికారులు సీసీ కెమెరాల ద్వారా జరిగిన ఘటనను పూర్తిగా పరిశీలించి ఈ బూత్‌లో మరలా పోలింగ్ జరిగే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మేయర్ అభ్యర్థి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ ఉదయం నుంచి దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తూనే ఉన్నారని, వారికి పోలీసులు పూర్తిగా సహకరించారని, బూత్‌లో వచ్చిన పది మందిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, తనతోపాటు ఉన్న మహిళా ఏజెంట్ చీరను కూడా లాగారని కన్నీటి పర్యంతమయ్యారు.


