రాజధాని రోడ్డుపై గుంత.. కూరుకుపోయిన బైకుతో చింత | - | Sakshi
Sakshi News home page

రాజధాని రోడ్డుపై గుంత.. కూరుకుపోయిన బైకుతో చింత

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

ఏపీ రాజధాని అమరావతికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఏడాదిగా మరమ్మతుల పేరుతో చారెడు మట్టి కూడా వేయకుండా వదిలేసిన పాపం నేడు ప్రయాణికులను అష్టకష్టాలకు గురిచేస్తోంది. మూడు రోజుల క్రితం తాడికొండలో భారీ వర్షం కురిసింది. దీంతో తాడికొండ– పెదపరిమి మధ్య రహదారి నిర్మాణంలో భాగంగా తవ్వి వదిలేయడంతో ఆ గుంతల్లో నీరు భారీగా చేరింది. టీడీపీ సర్కారు తీరుతో అటు గుత్తేదారు, ఇటు అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆదివారం నడిరోడ్డుపై ఓ ద్విచక్ర వాహనం కూరుకుపోవడంతో కనీసం బయటకు తీసేందుకు కూడా వీలు కాలేదు. ఓ తాడు కట్టి మరీ లారీతో బయటకు లాగాల్సి వచ్చింది. దీంతో సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్‌ జాం అయింది. దేవతల రాజధాని అమరావతి అంటూ చెప్పే చంద్రబాబు రాజధానికి వెళ్లే రోడ్డు కూడా నిర్మించలేకపోయారని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవతలు ఆకాశం నుంచి వస్తారు కదా.. ఇక నేలపై రోడ్లెందుకు అనుకున్నారేమో అంటూ సైటెర్లు వేయడం కనిపించింది. – తాడికొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement