సమగ్ర అభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర అభివృద్ధి సాధించాలి

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

గుంటూరు వెస్ట్‌: అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరి ఐటీ పార్క్‌, ఎయిమ్స్‌ వంటి సంస్థలతోపాటు జిల్లాలోని గుంటూరు, తెనాలి మునిసిపాలిటీలు, ఎంఎస్‌ఎంఈ రంగాలను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన ‘సిటీ ఎకనామిక్‌ రీజియన్‌’ నమూనాలో సమగ్ర అభివృద్ధి సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ మినీ కార్యాలయంలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి, పసుపు వంటి పంటల ముడి ఎగుమతులకే పరిమితం కాకుండా, స్థానికంగానే ఫుడ్‌ ప్రాసెసింగ్‌, గ్రేడింగ్‌, విలువల పెంపు యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. కృష్ణా నదీ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని విస్తరించాలని సూచించారు. వికసిత్‌ భారత్‌ 2047, స్వర్ణాంధ్ర విజన్‌ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధించేందుకు పటిష్ట ప్రాజెక్ట్‌ డీపీఆర్‌లు సిద్ధం చేయాలన్నారు. వచ్చే నెలలో విజయవాడలో జరగనున్న ప్రాంతీయ సదస్సు లక్ష్యంగా ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఓ పి.శేషశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి, ఏపీఐఐసీ జీఎం నరసింహారావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement