గుంటూరులో చరిత్ర తిరగరాద్దాం | - | Sakshi
Sakshi News home page

గుంటూరులో చరిత్ర తిరగరాద్దాం

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

గుంటూరులో చరిత్ర తిరగరాద్దాం

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం డబ్బు, అధికారం, పోలీసు వ్యవస్థ ఉన్నాయనే ధీమాతో ఉందన్నారు. అయినా వైఎస్సార్‌ సీపీ భయపడే ప్రసక్తే లేదన్నారు. గుంటూరులో చరిత్ర తిరగరాద్దామని పిలుపునిచ్చారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీకి, ముస్తఫా అక్రమ అరెస్టుకు, తనతోపాటు అప్పిరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాటం చేసి కూటమిని ఘోరంగా ఓటమి పాలుచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ విజయమే లక్ష్యం కావాలన్నారు. సమర్థులకు సీట్లు ఇస్తామని చెప్పారు. పార్టీ గెలుపు కోసం ఐక్యతతో ముందుకెళదామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement