దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

ఆటో, సెల్‌ఫోన్‌, వెయ్యి నగదు స్వాధీనం వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ పూర్ణచంద్రరావు

గుంటూరు రూరల్‌: దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి ఒక ఆటో, సెల్‌ఫోన్‌, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు స్నేహితులు దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. స్వర్ణభారతీనగర్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో వికాస్‌నగర్‌కు చెందిన ఉప్పుతల శ్రీకాంత్‌, స్వర్ణభారతీనగర్‌కు చెందిన ఓర్సు గోపీ పలు దోపిడీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఇరువురు కలిసి నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడినట్లు నిందితులు ఇరువురు విచారణలో ఎస్‌వీఎన్‌ కాలనీ ఆర్చి ఎదురుగా ఉన్న పొలంలో ఒక వ్యక్తిని బెదిరించి అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్‌, రూ.9,000 చోరీ చేసినట్లు చెప్పారు. కేసును ఛేదించిన నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ ఎ.మధుపవన్‌తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించారన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

చోరీలకు పాల్పడే ఇద్దరు మైనర్లు అరెస్ట్‌

ఇళ్లకు తాళాలు వేసిన ఇంటిపై రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడే ఇద్దరు బాలురను నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నగరంలోని సౌత్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పూర్ణచంద్రరావు నిందితుల వివరాలు వెల్లడించారు. పెద్దపలకలూరు జెండాచెట్టు సెంటర్‌, పట్టాభిపురం 2వ లైనుకు చెందిన ఇరువురు స్నేహితులు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకున్నారు. పలకలూరు రోడ్డులో అనుమానంగా తిరుగుతున్న ఇరువురిని అదుపులోకి తీసుకుని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. పోలీసుల విచారణలో నగరంలో, రూరల్‌ మండలంలో, నల్లపాడు, తురకపాలెం గ్రామం, ఎల్‌.వి.ఆర్‌. కాలనీలో తిరుగుతూ ఒక ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి చోరీకి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు. తురకపాలెం గ్రామం, ఎల్‌.వి.ఆర్‌. కాలనీలో ఒక ఇంటికి తాళం వేసి ఉన్న ఇంటిలో తాళాలు పగులగొట్టి వెండి పట్టీలు, నగదు తదితర వస్తువులు దొంగిలించినట్లు, రూ.80,000 నగదు చోరీ చేసినట్లు, నిందితులు ఒప్పుకున్నారన్నారు. అదే విధంగా పలు చోరీలకు పాల్పడినట్లు తెలపటంతో నిందితుల వద్ద నుంచి సుమారు రూ.2.5 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు అప్పగించి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement