నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ బైఠాయింపు | - | Sakshi
Sakshi News home page

నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ బైఠాయింపు

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

గుంటూరు రూరల్‌: న్యాయం చేయాలని కోరుతూ మహిళ నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నల్లకుంటకు చెందిన తిరుపతి శివప్రసాద్‌ మిర్చియార్డులో వేమెన్‌గా పనిచేస్తుంటాడు. స్నేహితుడు చల్లా రాజేష్‌ వద్ద మూడు సవర్ల బంగారు గొలుసును తన అవసరాల నిమిత్తం తీసుకుని దానిపై అప్పు తెచ్చుకున్నాడు. అదే విధంగా సైదా అనే స్నేహితుడి వద్ద 32 బస్తాలు మిర్చిని తీసుకుని డబ్బు ఇవ్వటంలేదు. దీంతో గత ఏడాది క్రితం నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో రాజేష్‌, సైదా ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ శివప్రసాద్‌ను పిలిచి బైండోవర్‌ రాసి, ఈనెల 15వ తేదీన డబ్బు చెల్లించే విధంగా సెటిల్‌మెంట్‌ చేశారు. ఈ నెల 15వ తేదీన శివప్రసాద్‌ డబ్బు చెల్లించకపోవటంతో రాజేష్‌, సైదా గురువారం నల్లపాడు పోలీస్‌ స్టేషన్లో గతంలో జరిగిన విషయాన్ని తెలియజేసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శివప్రసాద్‌ను ఉదయం పిలిపించి బాధితులకు డబ్బు ఇచ్చి వెళ్లాలని స్టేషన్‌లో కూర్చోబెట్టారు. నల్లకుంటకు చెందిన శివప్రసాద్‌ సోదరి లక్ష్మీపార్వతి పోలీసులను నిలదీసింది. తమ్ముడిని వెంటనే బయటకు పంపాలని పోలీస్‌ స్టేషన్‌ బయట రోడ్డుపై బైఠాయించింది. గమనించిన పోలీసులు శివప్రసాద్‌ను బయటకు పంపి ఈ కేసును కోర్టులో తేల్చుకోవాలని పంపివేశారు. సివిల్‌ సెటిల్‌మెంట్‌లు చేసేందుకు ప్రయత్నించిన సీఐ, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీపార్వతి ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement