ఏపీసీపీడీసీఎల్‌ నూతన ఎస్‌ఏఓ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఏపీసీపీడీసీఎల్‌ నూతన ఎస్‌ఏఓ బాధ్యతల స్వీకరణ

Sep 16 2026 3:31 AM | Updated on Sep 16 2026 3:31 AM

ఏపీసీపీడీసీఎల్‌ నూతన ఎస్‌ఏఓ బాధ్యతల స్వీకరణ బాలిక ఆత్మహత్య

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా విద్యుత్‌ శాఖ సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఎస్‌ఏఓ)గా బి.వెంకటేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.సారథి, ఎం.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ నాయకులు నూతన ఎస్‌ఏఓను కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సారథి, చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వెంకటేశ్వరరావు ప్రతిభగల అధికారిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన నేతృత్వంలో గుంటూరు జిల్లా విద్యుత్‌ శాఖతో పాటు ముఖ్యంగా అకౌంట్స్‌ విభాగం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎన్‌.సింగయ్య, అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఫైనాన్స్‌) వి.శ్రీనివాస్‌, అసోసియేషన్‌ నాయకులు కె.వరప్రసాద్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దుగ్గిరాల: ఇంటర్‌ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో పేరుకలపూడి నుంచి వచ్చిన రామకృష్ణ కుటుంబం గత కొంత కాలంగా నివసిస్తున్నారు. సంపతి వెంకట లక్ష్మి(16) తెనాలిలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement