తాడికొండ: తుళ్లూరు మండలం అబ్బురాజుపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఈ–03 రోడ్ (సీడ్ యాక్సిస్ రోడ్డు) ఎన్–14 జంక్షన్ వద్ద సర్వే నంబర్లు 51, 52, 55లో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణ పనులకు ఈ నెల 23న సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అబ్బురాజుపాలెం గ్రామ పరిధిలోని ఆసుపత్రి నిర్మాణ స్థలంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ, అడిషనల్ ఎస్పీ రవికుమార్, తాడేపల్లి –మంగళగిరి మున్సిపల్ కమిషనర్ హలీంబాషా, డీఎం హెచ్‌వో విజయలక్ష్మి, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ఇతర పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమన్వయ సమావేశం


