పోక్సో కేసులో యువకుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో యువకుడి అరెస్టు

Aug 29 2026 1:46 AM | Updated on Aug 29 2026 1:46 AM

లక్ష్మీపురం: ఓ బాలికను హాస్టల్‌ నుంచి తీసుకెళ్లిన యువకుడిని అరెస్ట్‌ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పెదకూరపాడు మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన కంచర్ల వెంకటేష్‌ ఫొటోగ్రాఫర్‌. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక ప్రస్తుతం గుంటూరులోని ఓ హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది. జూలై 29వ తేదీన అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి వెంకటేష్‌ తీసుకెళ్లినట్లు తేలింది. గతంలో కూడా వేధించినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి వెంకటేష్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్‌ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement