
కక్షతోనే దాడి మాజీ ఎమ్మెల్యే బొల్లా
రాష్ట్రంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం పక్కాగా అమలు జరుగుతోందని, దాని డైరెక్షన్‌లోనే టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తెగబుతున్నారని వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్ సీపీ ఏజెంట్‌గా పని చేశాడనే కక్షతోనే స్థానిక టీడీపీ గూండాలు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల ప్రోద్బలంతో అతన్ని చంపేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆకృత్యాలపై పోలీసులు న్యాయబద్ధంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.