మద్యం దుకాణం తొలగించండి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పుత్రశోకంతో తల్లడిల్లుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఇద్దరు బాధితులు ఎస్పీ సతీష్‌కుమార్ ఎదుట తమ గోడు వినిపించారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార కార్యక్రమం (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. బాధితుల అర్జీలను ఎస్పీ సతీష్‌కుమార్ పరిశీలించారు. ఫిర్యాదుదారుల బాధను ఆలకించారు. అర్జీలపై సబ్ డివిజన్లలోని పోలీసు అధికారులతో మాట్లాడారు. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణి దీక్ష, జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), సుబ్బారావు (మహిళా పీఎస్) అర్జీలు స్వీకరించారు.
కొడుకు ఆచూకీ గుర్తించండి
పెద్దబ్బాయి ఓంసాయిరెడ్డి గుంటూరు కృష్ణనగర్ నాలుగో వీధిలోని నారాయణ విద్యా సంస్థలో 10వ తరగతి చదివేవాడు. తొంభై శాతం సీటు రాయితీతో చేర్చాం. ఫీజు రాయితీ తొంభై శాతం నుంచి 80శాతానికి కుదించామని డబ్బులు చెల్లించాలని బయట నిలబెట్టారు. ఈ క్రమంలో నా సోదరుడు వెళ్లి ఫీజు చెల్లిస్తామని చెబితే లోనికి అనుమతించారు. గతనెల 8, 9 తేదీల్లో స్కూల్ నుంచి కుమారుడు ఫోన్ చేసి మాట్లాడాడు. బాగా చదువుతానని బదులిచ్చాడు. అదేనెల 13న విద్యా సంస్థల నుంచి ఫోన్ చేసి, ఓంసాయిరెడ్డి కనిపించడంలేదని తెలిపారు. సాయంత్రం వెళ్లి స్కూల్‌లో విచారించాం. అప్పటి నుంచి కుమారుని జాడలేదు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. కుమారుడు కనిపించక ఇప్పటికి నలభై రోజులకుపైగా గడిచింది. నా కొడుకుకు వ్యసనాల్లేవు.
– తండ్రి వెండిదండి శివశంకర్‌రెడ్డి, పోస్ట్‌మాస్టర్, ముప్పలపాడు గ్రామం, హనుమంతునిపాడు మండలం, ప్రకాశం జిల్లా
కుమారుడు మృతిచెందాడు..
ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి చిన్న కుమారుడైన వై.హరికృష్ణ (41) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్తంభాలగరువు సెంటర్ ఓ కంటి ఆసుపత్రి సమీపాన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ హరికృష్ణను కాలితో కొట్టి, చేతులతో నెట్టేశారు. దీంతో కొడుకు కిందపడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. గాయపడిన అతను చికిత్స పొందుతూ ఈనెల 18న మృతిచెందాడు. దీనిపై పట్టాభిపురం పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పది రోజులుగా పోలీసులు చుట్టూ తిరుగుతున్నా.. ఇప్పటి వరకు అనుమానితులను గుర్తించలేదు. ఇప్పటికై నా నిందితులను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నాం.
– వై.రత్నకుమారి,
రాజేంద్రనగర్ ఒకటో వీధి.
న్యాయం చేయండి
ఎస్పీకి విన్నవించుకున్న బాధితులు
కొడుకు జాడ కనుక్కోవాలని ఒకరి విన్నపం
కుమారుడిని హతమార్చిన వారిని గుర్తించాలని మరొకరి వేడుకోలు
పుత్రశోకంతో తల్లడిల్లుతున్నాం