భర్తను కాదని మరొకరితో భార్య వివాహేతర సంబంధం..   | - | Sakshi
Sakshi News home page

భర్తను కాదని మరొకరితో భార్య వివాహేతర సంబంధం..  

Oct 25 2023 1:20 AM | Updated on Oct 25 2023 1:59 PM

- - Sakshi

గుంటూరు రూరల్‌: అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యపై భర్త దాడిచేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన సంఘటన వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో చోటు చేసుకుంది. వట్టిచెరుకూరు పోలీసుల కథనం ప్రకారం పుల్లడిగుంటకి చెందిన సల్మాకు ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌ గ్రామానికి చెందిన సుబానితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది.

అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడేళ్ల క్రితం ఇరువురు విడిపోయి ప్రస్తుతం సల్మా పుల్లడిగుంటలో నివసిస్తోంది. ఈ క్రమంలో సల్మాకు అమీనాబాద్‌కు చెందిన సాహిదుల్లా అనే వ్యక్తితో పరిచయమై వివాహేతర సంబంధంగా మారింది. సోమ వారం సాయిదుల్లా, సల్మా లు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటివద్ద ఉన్నారని తెలుసుకున్న భర్త సుబాని మరొక వ్యక్తితో కలిసి కత్తులతో దాడిచేశాడు.

ఈ దాడిలో సాహిదుల్లా (40) అక్కడికక్కడే మృతి చెందగా సల్మాకు తీవ్రగాయాలయ్యాయి. ఇరువురు మృతి చెందారని భావించి సుబాని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా సల్మాను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వట్టిచెరుకూరు పోలీసులు తెలిపారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement