కరోనా బాధితుల్లో ఎక్కువ మందికి షుగర్‌.. 

World Diabetes Day 2022  - Sakshi

అరసవల్లి: మధుమేహంగా పిలిచే షుగర్‌వ్యాధి.. తీపి పదార్ధాలు ఎక్కువ తినే వారిలో వస్తుందని ఇప్పటికీ చాలా మంది నమ్మకం. ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ మానసిక ఒత్తిడి, ఊబకాయం, వ్యాయా యం చేయకపోవడం, ఆహార నియంత్రణ లేకపోవడం వంటివి సమస్యగా పరిణమిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేసిన పరీక్షల్లో మాత్రమే చాలా మందికి షుగర్‌ వ్యాధి బయటపడుతోంది. ఈలోపే  నష్టం జరిగిపోతోంది.  

 

కరోనా బాధితుల్లో ఎక్కువ మందికి షుగర్‌.. 
జిల్లాలో 1,34,303 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ బారినపడ్డారు. కరోనా సోకిన తర్వాత  ఎక్కువ శాతం మందికి షుగర్‌ వ్యాధి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. అప్పటికే షుగర్‌ వ్యాధి నియంత్రణలో ఉన్నవారు కోవిడ్‌ నుంచి సులభంగానే బయటపడ్డారు. నియంత్రణ లేని వారు ఐసీయూలో చేరారని, కొందరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో 49560 మంది షుగర్‌ వ్యాధి బారిన పడినట్లు  జిల్లా వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతోంది. 

15 శాతం కేసులు పెరిగాయి.. 
జిల్లా జనాభాలో ఒకప్పుడు 8 శాతంగా ఉన్న షుగర్‌ వ్యాధిగ్రస్తులు..ఇప్పుడు కరోనా తర్వాత 15 శాతం మంది పెరిగారు. ఆహారంలో కార్బోహైడ్రేడ్, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, పీచు కలిగిన పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గి బరువు పెరగకుండా సహాయం చేస్తుంది. 
– డాక్టర్‌ కెల్లి చిన్నబాబు, షుగర్‌ వ్యాధి నిపుణుడు 

స్టెరాయిడ్స్‌ వాడితే ప్రమాదం
షుగర్‌ వ్యాధి ఉన్నవారు స్టెరాయిడ్స్‌ మందులు వాడకూడదు. ఇవి వాడితే శరీరంలో ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కోవిడ్‌ బాధితులు స్టెరాయిడ్స్‌ అధికంగా వాడటం వల్ల వారిలో షుగర్‌ మరింతగా పెరిగింది. పరిమిత మోతాదులో వాడితే ఏ మందూ హానిచేయదు.  
– డాక్టర్‌ ఎం.మనోజ్, ద్వారకామయి హాస్పిటల్‌    

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top