అధిక కొలెస్ట్రాల్‌ లక్షణాలని గుర్తించండి ఇలా...

What are the symptoms of high cholesterol in the body? - Sakshi

ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకుంటున్నా, మీకు బీపీ పెరుగుతోందా? కాళ్లూ చేతులు తిమ్మిర్లుగా ఉంటున్నాయా? గోళ్ల రంగు మారుతోందా? ఇవన్నీ వ్యాధి లక్షణాలే. అయితే భయపడవద్దు. అది ఏమంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు కానీ, తేలిగ్గా కూడా తీసుకోకూడదు.

మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిందనడానికి నిదర్శనం అది. కొలెస్ట్రాల్‌ దానంతట అది ప్రమాదకరమైనది కాదు కానీ, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల దానిని నిర్లక్ష్యం చేయద్దు. అసలు మన శరీరంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే ఏ లక్షణాలుంటాయో అవగాహన కోసం. 

సాధారణంగా కొలెస్ట్రాల్‌ పేరు వినగానే అది చాలా చెడ్డదని అనుకుంటారు. కానీ ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. మంచి కొలస్ట్రాల్‌ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని అనుసరించాలి. 

కొలెస్ట్రాల్‌ పెరిగిందనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి...
1. అధిక రక్తపోటు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగితే అది నేరుగా రక్తపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొవ్వు శాతం ఎంత పెరిగితే రక్తపోటు అంతగా పెరుగుతుంది కాబట్టి కారణం తెలియకుండానే బీపీ పెరిగిపోతుంటే కొలెస్ట్రాల్‌ ఉందేమో అని అనుమానించాల్సి ఉంటుంది.  

2. కాళ్లు, చేతులు తిమ్మిర్లు పాదాలు మొద్దుబారడం: కాళ్లు చేతులు తిమ్మిరికి గురి కావడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతంగా గుర్తించాలి. ధమనులలో రక్త ప్రసరణ, ఆక్సిజన్‌ సరఫరాలో అవరోధం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ΄ాదాలలో నొప్పి, తిమ్మిరి కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగదు. 

3. గోర్ల రంగులో మార్పు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగినప్పుడు ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సిరల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చేతివేళ్లు, కాలి వేళ్లకు సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి లేత గులాబీ రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతాయి. ఉండవలసిన దానికన్నా అధిక కొవ్వు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించాలి. 

మధుమేహం ఉంటే కొలెస్ట్రాల్‌ కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్న వాళ్లు మూడు నెలలకొకసారి రక్తంలో సరాసరి చక్కెర శాతం ఎంత ఉందో తెలుసుకునే పరీక్షతో΄ాటు కొలెస్ట్రాల్‌ ΄ాళ్లను తెలుసుకునే పరీక్ష కూడా చేయించుకుని దానిని అదుపు చేసేందుకు తగిన మందులు తీసుకోవాలి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top