వృక్షాసనం.. ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం! | Vrikshasana Yields Excellent Results For Concentration And Health | Sakshi
Sakshi News home page

వృక్షాసనం.. ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం!

Jun 13 2026 12:03 PM | Updated on Jun 13 2026 12:23 PM

Vrikshasana Yields Excellent Results For Concentration And Health

హెల్త్‌

వృక్షాసనం అంటే ‘చెట్టు భంగిమ‘ అని అర్థం. ‘వృక్షాసనం మనకు చెట్టు వంటి స్థిరత్వం, సమతుల్యత, ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం. ‘వృక్షాసనం అనేది ఒక కాలి మీద నిలబడి, శరీర సమతుల్యతను కాపాడుకునే యోగాసనం. చెట్టు మాదిరిగా స్థిరంగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 4–6 గంటల వ్యవధి తర్వాత ఈ ఆసనం వేయడం అత్యంత శ్రేయస్కరం.

వృక్షాసనం చేసే విధానం..

  • యోగా మ్యాట్‌పై నిలబడి, రెండు కాళ్లను దగ్గరగా ఉంచండి. ఇప్పుడు కుడి కాలిపై నిలబడి, శరీర బరువును బ్యాలెన్స్‌ చేయండి.

  • ఎడమ మోకాలిని వంచి, ఎడమ పాదాన్ని కుడి కాలి తొడ లోపలి భాగానికి (తొడమూలానికి వీలైనంత దగ్గరగా) గట్టిగా ఆన్చండి. 

  • రెండు చేతులను నెమ్మది గా పైకి లేపి, నమస్కార ముద్రలో అరచేతులను కలపాలి.

  • ముందు భాగంలో ఏదైనా ఒక వస్తువుపై దృష్టిని కేంద్రీకరిస్తూ, శ్వాసను సాధారణంగా తీసుకుంటూ 10–20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.

  • ఇదే పద్ధతిని కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచి మరోవైపు రిపీట్‌ చేయాలి..

    ప్రయోజనాలు..

  • విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది, మనో నిబ్బరం, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.

  • కాళ్లు, చీలమండలు, వెన్నెముక దృఢంగా మారతాయి.

  • నాడీ వ్యవస్థకు ప్రశాంతత చేకూరుతుంది.

  • నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.

  • ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.

  • శరీరం బ్యాలెన్స్‌, స్టెబిలిటీ పెరుగుతాయి.

జాగ్రత్తలు..

  • తీవ్రమైన మైగ్రేన్, అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉంటే ఈ ఆసనం వేయకూడదు.

  • నిద్రలేమి సమస్య ఉన్నవారు దీనిని నిపుణుల సమక్షంలోనే చేయాలి.

  • మోకాళ్లు, తుంటి లేదా మెడకు సంబంధించిన సర్జరీలు అయినవారు ఈ ఆసనాన్ని వేయరాదు.

  • మొదటిసారి చేసేవారు బ్యాలెన్స్‌ కోల్పోకుండా ఉండటానికి గోడ సపోర్ట్‌ తీసుకోవచ్చు లేదా కుర్చీని పట్టుకుని చేయవచ్చు.

- అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement