
మీ వార్డ్‌రోబ్‌ను ట్రెండీగా మార్చాలంటే, నటి హన్సిక ఫ్యాషన్ స్టయిల్‌ను ఫాలో అయితే చాలు. ఎప్పటికప్పుడు స్టయిలింగ్‌లో భిన్నమైన సెలక్షన్స్‌తో అదరగొడుతూ ఒక ట్రెండ్ సెట్టర్‌గా, ఒక ఫ్యాషన్ గైడ్‌లా కనిపించే హన్సిక, ప్రస్తుతం ఉన్న ఈ లుక్ కోసం ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఎంటో ఇక్కడ చూద్దాం..
ఫ్యాషన్లు ఎన్ని మారినా వన్నె తరగని ట్రెండ్ ముత్యాలదే! తెల్లగా మెరిసిపోతూ మగువలకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. వీటిని పెట్టుకున్న వెంటనే ధరించిన దుస్తుల లుక్ బాగా ఎలివేట్ అవుతుంది. సింపుల్ పెర్ల్ జ్యూలరీతో ఆఫీస్ దుస్తులకు స్టయిలింగ్ చేసుకుంటే క్లాసిక్ లుక్ మీ సొంతం. చీర, లెహంగా, డ్రెసెస్ మీదనైనా కూడా ఇవి చక్కగా నప్పుతాయి.
ఇందుకు తగ్గట్టుగానే ముత్యాల నగల్లో వివిధ ఆకర్షణీయమైన డిజైన్స్‌లో ముత్యాల ఆభరణాలు లభిస్తున్నాయి. ముత్యాలు ఎక్కువగా డార్క్ షేడ్ దుస్తులతో ఉత్తమంగా కనిపిస్తాయి. ఇక ముత్యాల నగలను ధరించేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. వీటిని వేరే ఇతర ఆభరణాలతో కలిపి స్టయిలింన్ చేయకూడదు. అన్నీ ఆభరణాలు ముత్యాలవే అయితే బాగుంటుంది.
ఈ చిట్కానే పైన నటి హన్సిక కూడా ఫాలో అయిందని ఫొటో చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ హన్సిక ధరించిన చీర బ్రాండ్ సురుమయే, ధర రూ. 23,000. బ్లౌజ్ ధర రూ. 6,00 నెక్ పీస్ బ్రాండ్: ప్రీటో ధర: రూ. 5,800 ఇయర్ రింగ్స్ బ్రాండ్: గోల్డెన్ విండోధర: రూ. 1,890