గణపతి బప్పా మోరియా : స్టార్‌ కిడ్‌ రాహా ఎంత ముద్దుగా ఉందో! | Vinayaka Chavithi 2024: Kapoor family kids Ganesh Chaturthi celebrations | Sakshi
Sakshi News home page

గణపతి బప్పా మోరియా : స్టార్‌ కిడ్‌ రాహా ఎంత ముద్దుగా ఉందో!

Sep 16 2024 11:20 AM | Updated on Sep 16 2024 1:01 PM

Vinayaka Chavithi 2024: Kapoor family kids Ganesh Chaturthi celebrations

వినాయకవి చవితి పండుగను  చిన్నా, పెద్దా అంతా దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించు కుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యాయి కూడా.  తాజాగా గణేష్ చతుర్థి వేడుకల ఫోటోలను  బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్ షేర్ చేసింది. ఈ ఫోటోలో కపూర్‌ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు నిండుగా కనిపించడం విశేషంగా నిలిచింది.  ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌, రణబీర్ కపూర్, అలియాభట్‌ ముద్దుల తనయ రాహా తండ్రి ఒడిలో మరింత ముద్దుగా కనిపించింది. ఇంకా స్టార్‌ కిడ్స్‌  ఆదార్ జైన్, అలేఖా అద్వానీ, కరీనా కపూర్ కుమారులు జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ కూడా అందంగా ఉన్నారు.

 తమ ఇంట్లో జరిగిన గణనాధుడి వేడుకలకు సంబంధించిన ఫోటోలను (సెప్టెంబర్ 15) ఆదివారం కరిష్మా ఇన్‌స్టాలో  షేర్‌ చేసింది. ఇందులో  రణధీర్ కపూర్, బబితా కపూర్  కరిష్మా కపూర్, కరీనా కపూర్, జెహ్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్, రణబీర్ కపూర్, రాహా కపూర్ , ఇతరులున్నారు.  "గణపతి బప్పా మోరియా", అంటూ అంతా కలిసి గణపతి బప్పాకు పూజలు అనంతరం ఫ్యామిలీ ఫోటో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే కపూర్ కుటుంబంలో  రాహా తల్లి అలియా భట్ , కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్  మిస్‌ అయ్యారు.

అలాగే నానమ్మ నీతా కపూర్‌తో, చిన్నారి రాహా క్యూట్‌ ఇంటరాక్షన్‌ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌లో అమ్మ చంకలో ఒదిగిపోయిన రాహా, నానమ్మను  చూసి లిటిల్ ప్రిన్సెస్ తెగ సంతోష పడింది. సోమవారం  ఉదయం వీరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు.

 

తన రాబోయే చిత్రం జిగ్రా ప్రమోషన్‌లో అలియా బిజీగా ఉంది. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా  సెన్సేషనల్‌ మూవీ యానిమల్‌ చిత్రంలో రణ్‌బీర్‌ స్టార్‌డం అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నితీష్ తివారీ రామాయణంలో శ్రీరాముని పాత్రలో నటిస్తున్నాడు.

 ఇదీ చదవండి: వాకింగ్‌ : జంటగానా? ఒంటరిగానా? ఎపుడైనా ఆలోచించారా?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement