ఆ జంట కళ్లు చెబుతాయి ‘ప్రేమ’ ఎంత స్వచ్ఛమైనదో!

United Kingdom Couple James And Chloe Lusted Unique Love Story - Sakshi

మనసుకు నచ్చాలే కానీ మనిషి రూపంతో పనేముంటుంది? ప్రేమ గుడ్డిదని అనేవాళ్లు అంటూనే ఉంటారు. ఒక్కటైన ఆ జంట కళ్లు చెబుతాయి తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో? ఈ అరుదైన బ్రిటన్‌ జంటే అందుకు ఉదాహరణ. క్లో లస్టెడ్‌ అనే మహిళ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. ఆమె భర్త జేమ్స్‌.. పొడవు 3 అడుగుల 7 అంగుళాలు మాత్రమే. 2016లో వీరి పెళ్లి వార్త ప్రపంచాన్నే అబ్బురపరచింది.

2021, జూన్‌ 2న ఈ కారణంతోనే (ఇలా భార్యాభర్తల మధ్య ఉండే ఎత్తుల తేడాతో) గిన్నిస్‌ రికార్డ్‌లకు ఎక్కింది ఈ జంట. ప్రస్తుతం జేమ్స్‌ (33) నటుడుగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా పని చేస్తున్నాడు. క్లో (27)  ఉపాధ్యాయురాలు గా పనిచేస్తోంది.

వీరికి పెళ్లై ఐదేళ్లు కాగా.. వారికి ఒలీవియా అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎముకలపై ప్రభావం చూపే డయాస్ట్రోఫిక్‌ డిస్‌ప్లేసియా అనే రుగ్మతతో బాధ పడుతున్న జేమ్స్‌.. ఎదుగుదల లేకుండా పొట్టిగానే ఉండిపోయాడు. 2012లో మొదటిసారి వీళ్లు కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ఒకరిని ఒకరు కలుసుకున్నారు. 2014లో జేమ్స్‌... క్లోను ప్రపోజ్‌ చేశాడట. ప్రస్తుతం తమ రెండేళ్ల కూతురితో కలసి దిగిన వీరి ఫొటోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top