ఆ పూలను తాకితే చాలు.. ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్‌!

Unique Flowers Attracts South Australia - Sakshi

ప్రకృతి.. తన వైవిధ్యాలతో మానవమాత్రుల్ని ఎప్పటికప్పుడు అబ్బురపరస్తూనే ఉంటుంది. గమ్మతైన అందాలతో నివ్వెరపరస్తూనే ఉంటుంది. బాతుల్ని పోలిన పువ్వులు.. వినడానికే వింతగా ఉంది కదూ! ఈ చిత్రాలను చూస్తే మీకే అర్థమవుతుంది. కలేనా మేజర్‌ ఆర్కిడ్‌ అనే జాతికి చెందిన మొక్క పువ్వులు అచ్చం ఎగురుతున్న బాతుల్లా ఉంటాయి.

చూడటానికి ఇవి రెక్కలు విచ్చుకుని పైకి ఎగురబోతున్నట్లే తారసపడతాయి. తూర్పు, దక్షిణ ఆస్ట్రేలియాలో ఈ మొక్కలు అధికంగా కనిపిస్తుంటాయి. ఈ పూల తల భాగంపైన తాకితే చాలు.. వెంటనే టచ్‌ మి నాట్‌ మొక్కలాగా ముడుచు కుంటాయి. ఊహించని ప్రమాద సూచికగా భావించి, అమాంతం తలను వాల్చుకుని దాక్కున్నట్టుగా అలా ముడుచుకుంటాయన్నమాట. అద్భుతం కదూ!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top