Union Budget 2023: బడ్జెట్‌ ప్రసంగంపై యువతకు ఎందుకంత ఆసక్తి? ఈ విషయాలు తెలుసా?

Union Budget 2023: What Are Youth Expectations Interesting Facts - Sakshi

‘బడ్జెట్‌ అంటే అంకెల వరుస కాదు. అంతకంటే ఎక్కువ. మన జీవితంతో ముడిపడి ఉన్న విషయం’  ‘బడ్జెట్‌ నవ్విస్తూనే ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే నవ్విస్తుంది’ ... ఇలాంటి మాటలెన్నో బడ్జెట్‌కు ముందు, బడ్జెట్‌కు తరువాత వినిపిస్తూనే ఉంటాయి. యువతరం ఈ మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదుగానీ ‘బడ్జెట్‌ ప్రసంగం’ వినడానికి మాత్రం తగిన ఆసక్తి ప్రదర్శిస్తోంది.

సివిల్స్‌ కలలు కనే వారి నుంచి స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాలనుకునే వారి వరకు, క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపుతున్న వారి నుంచి లాంగ్‌–టర్మ్‌ సేవింగ్‌ కల్చర్‌లో భాగం అవుతున్న వారి వరకు యువతరంలో చాలామంది బడ్జెట్‌ తీరుతెన్నులు, విషయాలు, విశేషాలను తెలుసుకోవడానికి, తమదైన శైలిలో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు...

కాలేజీలో చదువుతున్నవారు, మొన్న మొన్ననే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, ఉద్యోగం ఊసు ఎత్తకుండా స్టార్టప్‌ కలలు కనే యంగ్‌స్టర్స్‌కు బడ్జెట్‌ ప్రసంగం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘క్యాపిటల్‌ బడ్జెట్‌ అంటే ఏమిటి? రెవెన్యూ బడ్జెట్‌ అంటే ఏమిటి? అసలు బడ్జెట్‌ అంటే ఏమిటి?’... రెండు సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన నిహారికకు తెలిసి ఉండకపోవచ్చు, తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకపోవచ్చు... కాని ఇప్పుడు పరిస్థితి వేరు.

తానేమీ ఆర్థికశాస్త్ర విద్యార్థి కాకపోయినా బడ్జెట్‌ గురించి రకరకాల కోణాలలో తెలుసుకోవడం అనేది ఆమె ప్రధాన ఆసక్తిగా మారింది. దీనికి కారణం భవిష్యత్‌లో సివిల్స్‌ పరీక్ష రాయాలనుకోవడం. ‘అన్ని విషయాలలో అవగాహన ఉంటేనే సివిల్స్‌లో సక్సెస్‌ అవుతాం. ఇష్టమైన సబ్జెక్ట్‌కు పరిమితమైతే కల కలగానే మిగిలిపోతుంది’ అంటుంది నిహారిక.

యంగ్‌పీపుల్‌ బడ్జెట్‌ ప్రసంగం వినడానికి ఆసక్తి చూపడానికి గల కారణాలలో  సివిల్స్‌లాంటి పరీక్షలు మాత్రమే కాదు ‘ఏ రంగాలలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి’ అని తెలుసుకోవడం కూడా ఒకటి. గత సంవత్సరం బడ్జెట్‌లో పద్నాలుగు పరిశ్రమలలో లక్షలాది ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్తావించారు.

 ‘ఈ సంవత్సరం పరిస్థితి ఏమిటి?’ అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఆ ఆసక్తే వారిని బడ్జెట్‌పై ఆసక్తి కలిగేలా చేస్తుంది.
కంపెనీల లే ఆఫ్‌లతో ఉద్యోగం కోల్పోయిన వారు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ‘మళ్లీ ఉద్యోగం వెదుక్కోవడం ఎందుకు? మనమే ఒక స్టార్టప్‌ స్టార్ట్‌ చేసి సక్సెస్‌ కావచ్చు కదా’ అనుకునేవారు యువతరంలో చాలామందే ఉన్నారు.

‘ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు సృష్టించండి’ అని ప్రభుత్వం చెబుతున్న మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
స్టార్టప్‌ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్‌ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్‌ ప్రసంగం వినడం అనివార్యం అయింది.

హైబ్రిడ్‌ వర్కింగ్‌ మోడల్‌ (ఆఫీస్, ఇంటి నుంచి రెండు విధాలుగా పనిచేసే అవకాశం ఉన్నవారు) ‘మా గురించి ఏమైనా ప్రస్తావన ఉందా!’ అన్నట్లుగా బడ్జెట్‌పై ఒక కన్ను వేస్తున్నారు.
దీర్ఘకాలిక దృష్టితో పొదుపు చేయడం అనేది దేశ ఆర్థికవృద్ధికి మాత్రమే కాదు, పొదుపు చేసే వారి మంచి భవిష్యత్‌కు కూడా కారణం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్‌–టర్మ్‌ సేవింగ్‌ కల్చర్‌ను యువతలో పెంపొందించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే బడ్జెట్‌ ప్రసంగం వినాల్సిందే.
సాంకేతిక నైపుణ్యవంతులైన యువతరం రకరకాల ఆర్థిక వనరులను, సాధనాలను వెలికి తీయడంలో ముందుంటుంది.

ఈ క్రమంలో సహజంగానే వారి దృష్టి క్రిప్టో కరెన్సీపై ఉంది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి పన్నులు, నియంత్రణ అంశాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్‌ ప్రసంగం వింటున్నారు.
తమ ప్రయోజనాలకు సంబంధించి బడ్జెట్‌పై ఆసక్తి ఒక కోణం అయితే, సామాజిక కోణం అనేది రెండోది. ఇందుకు ఉదాహరణ దిల్లీకి  చెందిన హిమవర్ష. డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి అయిన హిమవర్షకు విద్యారంగం అనేది ఆసక్తికరమైన సబ్జెక్ట్‌.

‘జాతీయ విద్యావిధానం విద్యారంగానికి తగినంత బడ్జెట్‌ కేటాయించమని చెబుతుంది. అయితే అవసరమైనదానిలో సగం బడ్జెట్‌ను మాత్రమే కేటాయిస్తున్నారు. మన దేశంలో విద్యారంగం అనేది వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. ఈ బడ్జెట్‌లోనైనా సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాను’ అంటుంది హిమవర్ష.

ఆమె ప్రస్తావిస్తున్న మరో అంశం... డిజిటల్‌ యూనివర్శిటీ.
‘డిజిటల్‌ యూనివర్శిటీ అనేది మన విద్యానాణ్యతను ప్రపంచస్థాయి ప్రమాణాలతో పెంచడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం బడ్జెట్‌లో డిజిటల్‌ యూనివర్శిటీ గురించి ప్రకటించారు. దీనికి సంబంధించి ఆశాజనకమైన విషయాలు ఈ బడ్జెట్‌లో ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఏఆర్, వీఆర్, రోబోటిక్స్‌కు ప్రత్యేక కేటాయింపు ఉండాలి. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అంటుంది హిమవర్ష.

‘బడ్జెట్‌’ అనే బడిపై యువతరం ఆసక్తి ప్రదర్శించడమే కాదు ఓనమాలు నేర్చుకొని, విషయ విశ్లేషణ చేస్తూ జ్ఞానపరిధిని పెంచుకొంటుంది. మంచిదే కదా!
స్టార్టప్‌ మొదలుపెట్టాలనుకునేవారికి బడ్జెట్‌ గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం అయిపోయింది. 
అంకుర పరిశ్రమలకు పన్ను రాయితీ, ప్రోత్సాహకాలు... మొదలైనవి తెలుసుకోవడానికి బడ్జెట్‌ ప్రసంగం వినడం అనివార్యం అయింది. 

మరిన్ని వార్తలు :

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-02-2023
Feb 01, 2023, 11:11 IST
వచ్చే ఏడాదిలో ఎన్నికలు. కాబట్టి, ఇదే చివరి బడ్జెట్‌. పేదమధ్యధనిక వర్గాలు ఎన్నో అంచనాలు.. 
01-02-2023
Feb 01, 2023, 10:57 IST
న్యూఢిల్లీ:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మరికొద్ది క్షణాల్లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి అధ్యక్షతన  సమావేశమైన  క్యాబినెట్‌...
01-02-2023
Feb 01, 2023, 10:42 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఈరోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. దేశమంతా ఆమె ప్రసంగం, కేటాయింపులు,...
01-02-2023
Feb 01, 2023, 10:19 IST
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 512 పాయింట్లు ఎగియగా నిఫ్టీ 140 పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. ...
01-02-2023
Feb 01, 2023, 09:59 IST
రాజంపేట: పార్లమెంట్‌లో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను  ప్రవేశపెట్టనున్నారు. ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో ఉమ్మడి వైఎస్సార్‌...
01-02-2023
Feb 01, 2023, 08:37 IST
Union Budget 2023: ఎట్టకేలకు దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్‌ 2023ను ప్రవేశపెట్టాల్సిన సమయం రానే వచ్చింది. ఈ రోజు...
01-02-2023
Feb 01, 2023, 08:36 IST
ఊరటలు, ఊరడింపులు, ఉపశమనాల కోసం ఉద్యోగులు మొదలుకుని ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాల దాకా అందరూ ఏటా ఎదురు చూసే...
01-02-2023
Feb 01, 2023, 07:54 IST
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో స్టాక్‌ మంగళవారం సూచీలు స్వల్ప లాభాలతో గటెక్కాయి. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో 2022–23 ఆర్థిక సర్వే...
01-02-2023
Feb 01, 2023, 07:33 IST
న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2023ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన మంగళవారం...
01-02-2023
Feb 01, 2023, 05:10 IST
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన గాయాలతోపాటు కోవిడ్‌ మహమ్మారి విసిరిన సంక్షోభంతో రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో...
01-02-2023
Feb 01, 2023, 04:27 IST
సాక్షి, అమరావతి: విభజన చట్టం ప్రకారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రానిదే....
01-02-2023
Feb 01, 2023, 03:40 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు ఎలా ఉంటాయోననే దానిపై తెలంగాణ ప్రభుత్వ...
01-02-2023
Feb 01, 2023, 03:28 IST
నేడు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. దేశంలో నెలకొని...
31-01-2023
Jan 31, 2023, 17:31 IST
సాక్షి, హైదరాబాద్‌: మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌పై అన్ని వర్గాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికలకు...
31-01-2023
Jan 31, 2023, 17:01 IST
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023ని  రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సమర్పించనున్నారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్‌...
31-01-2023
Jan 31, 2023, 02:03 IST
సాక్షి, అమరావతి: కేంద్రప్రభుత్వ బడ్జెట్‌ రైలు ఈసారైనా రాష్ట్రంలో ఆగుతుందా.. దీర్ఘకాలిక రైల్వే ప్రాజెక్టులను గమ్యస్థానానికి చేరుస్తుందా.. కేంద్ర ఆర్థికమంత్రి...
30-01-2023
Jan 30, 2023, 18:53 IST
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు,...
30-01-2023
Jan 30, 2023, 16:28 IST
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ని ఫిబ్రవరి నెలలో పార్లమెంట్‌లో ప్రవేశపెడుతోంది. అయితే గత కొన్నేళ్లుగా మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం...
30-01-2023
Jan 30, 2023, 16:27 IST
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ రీసెర్చ్  వివాదం సెగ రానున్న బడ్జెట్‌ సెషన్‌ను భారీగానే తాగనుంది.  ప్రతి పక్షాల...
30-01-2023
Jan 30, 2023, 13:07 IST
నూతన వార్షిక బడ్జెట్‌లోనైనా ప్రధాని దేశంలో 60 కోట్లు పైబడి ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలపై కనికరం చూపిస్తారా? ... 

Read also in:
Back to Top