కొత్త బంగారు లోకం..! బెస్ట్‌ డెస్టినేషన్‌ ప్లేస్‌ ఇది.. | Travel Tips: Jungfraujoch Top of Europe Grindelwald Tourism | Sakshi
Sakshi News home page

కొత్త బంగారు లోకం..! బెస్ట్‌ డెస్టినేషన్‌ ప్లేస్‌ ఇది..

Apr 20 2026 3:42 PM | Updated on Apr 20 2026 4:04 PM

Travel Tips: Jungfraujoch Top of Europe Grindelwald Tourism

యూరోప్‌లో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్‌ ఉన్న ప్రాంతంగానే కాదుఅందమైన కిరీటంగా భాసిల్లుతోంది జంగ్‌ఫ్రాజోచ్‌ భూమి మీద నుంచి ఆకాశాన్ని హత్తుకున్నట్టుమంచు కొండల మధ్యలో గడిపిన క్షణాలు...ఎండాకాలంలో చల్లని గాలి పలకరింపు.. మాటలకు అందని ప్రయాణానుభూతిని జంగ్‌ఫ్రాజోచ్‌ అందిస్తుంది. స్వర్గపు తలుపు తెరిచి కొత్త లోకంలోకి వెళ్లామా..! అనే ఆశ్చర్యానందంలో ముంచెత్తుతుంది.

స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లేకన్‌ దగ్గర మొదలై.. పచ్చని కొండల మధ్య నుంచి మెల్లిగా మంచు మెరుపుల వైపు వెళ్లే జంగ్‌ఫ్రాజోచ్‌ ప్రయాణం మనసును మృదువుగా తాకుతోంది. జీవితకాలపు అనుభూతిని అందిస్తుంది.

సందర్శనీయ ప్రదేశాలు
ఐగర్‌ గ్లేషియర్‌ నుంచి మొదలై స్పింక్స్‌ అబ్జర్వేటరీ దాకా వెళ్లే ప్రతీ అడుగు ఒక కొత్త పరిశోధనలా ఉంటుంది. ఐస్‌ ప్యాలెస్‌లోని టన్నెల్స్‌లో నడస్తుంటే మనం ఒక డ్రీమ్‌ వరల్డ్‌లో ఉన్నాం అనే ఫీలింగ్‌ కలుగుతుంది. 

ఐస్‌తో చేసిన కళాఖండాలు మనిషి, ప్రకృతి కలిసే చేసే సృజన అద్భుతంగా ఎలా ఆవిష్కరిస్తుందో అర్థం అవుతుంది.

ఐస్‌ ప్యాలెస్‌లో అనుభవాలు
గ్లేషియర్‌ లోపల తవ్విన ఈ టన్నెల్స్‌లో నీలి రంగు మెరుపులు మన కళ్ల ముందు ఒక మేజిక్‌లా కదులుతూ ఉంటాయి. ఇక్కడ గద్ద, ఎలుగుబంటుల రూపంలో చేసిన మంచు శిలలు చాలా సహజసిద్ధంగా అనిపిస్తాయి. ఉదయం వేళలో ఈ ఐస్‌ ప్యాలెస్‌కి వెళ్లడం ఎంతో మధురానుభూతిని కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో క్రౌడ్‌ తక్కువగా ఉంటాయి. ఆ ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.

ఎక్కడ ఉండాలి?
ఇంటర్లేకన్‌ లేదా గ్రైండెల్వాల్డ్‌ విలేజెస్‌లోని ట్రెడిషనల్‌ స్విస్‌ చాలెటట్స్‌ ఉంటే ప్రతీ ఉదయం మంచు కొండలు పలకరిస్తాయి. వుడెన్‌ వాల్కనీస్‌ నుంచి కనిపించే వ్యూ, రాత్రి పూట మెరిసే నక్షత్రాలు మనకు మర్చిపోలేని మధురానుభూతులను ఇస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే హోటల్స్‌లో బస ప్రకృతికి దగ్గరగా ఉన్నాం అనే ఫీలింగ్‌ని ఇస్తుంది.

ఎలా వెళ్లాలి? 
ప్రయాణం స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లేకన్‌ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి గ్రైండెల్వాల్డ్‌ టర్మినల్‌ రీచ్‌ అయ్యి, అక్కడి నుండి ఐగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కేబుల్‌ కార్‌ ఎక్కితే గంటలోనే పీక్స్‌ వరకు వెళ్లిపోవచ్చు.
ట్రైన్‌ వెళ్లేప్పుడు విండో సీట్‌ దగ్గర ఉంటే నేచర్‌లో వచ్చే వ్యూస్‌ని కెమెరాలో బంధించవచ్చు.

ఏం చూడాలి?
స్పింక్స్‌ అబ్జర్వేటరీ నుంచి ఆలెష్‌ గ్లేషియర్‌ను చూడటం ఒక సీ ఎక్స్‌పీరియెన్స్‌ అవుతుంది.

యూరోప్‌లోని పెద్ద గ్లేషియర్‌లో అలెష్‌ గ్లేషియర్‌ని చూస్తే తెల్లని నదిలా పర్వతాల మధ్యలో నుంచి ప్రవహిస్తుందా అనిపించక మానదు. మధ్యాహ్నం సమయంలో     

గ్లేషియర్‌పై సూర్య కిరణాలు ఒక కొత్త రంగును పరిచయం చేస్తాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కనులు సరిపోవు.

ఏం తినాలి ?
ఇక్కడ చాకొలెట్‌ షాప్‌లో దొరికే ఫ్రెష్‌ స్విస్‌ ఛాకోలేట్స్‌ ఒక ప్రత్యేక రుచిని పరిచయం చేస్తాయి. చల్లగా ఉన్న శిఖరాల మధ్యలో వేడిగా ఉండే స్విస్‌ ఛీజ్‌ లేదా ట్రెడిషనల్‌ సూప్‌ సేవిస్తూ ఉంటే ఆ టేస్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. 

లిండ్ట్‌ చాకొలేట్‌ హెవెన్లో దొరికే హాట్‌ చాకొలేట్‌ ఆ కోల్డ్‌ వెదర్‌లో ఒక వేడిని, ఎనర్జీని ఇస్తుంది. 
యాక్టివిటీస్‌

స్నో ఫన్‌ పార్క్‌లో మంచు మీద ప్రయాణం, ఐస్‌ ప్యాలెస్‌లోని టన్నెల్స్‌లో ఫోటోస్‌ తీసుకోవడం, ఆల్పైన్‌ సెన్సేషన్‌ కారిడార్‌లో నడుస్తూ జంగ్‌ఫ్రాజోచ్‌ హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు.

యూరోప్‌లోని హయ్యెస్ట్‌ పోస్ట్‌ ఆఫిస్‌ నుంచి ఒక పోస్ట్‌ కార్డు పంపడం మర్చిపోలేని ఙ్ఞాపకంగా. స్పింక్స్‌ డెక్‌పై నుంచి చుట్టూ ఉన్న పీక్స్‌ని అబ్జర్వ్‌ చేస్తూ ప్రశాంతంగా కూర్చోవచ్చు.

సమ్మర్‌లో ట్రిప్‌ ప్లాన్‌ చేస్తే సన్‌గ్లాసెస్‌ మర్చిపోకండి. స్నో రిఫ్లెక్షన్‌ కంటి చూపుపై ప్రభావం చూపిస్తుంది.

– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు 

(చదవండి: పర్ఫెక్ట్‌ సమ్మర్‌ డెస్టినేషన్‌..! అక్కడ సమయం గడవదు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement