చర్మం యౌవనంగా ఉండాలంటే...

Tips For Protecting Skin - Sakshi

కాలం గడుస్తున్న కొద్దీ ప్రతివారి చర్మంలోనూ మార్పులు వస్తుంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులతో అది యౌవ్వనంలో ఉండే మెరుపును,  బిగుతును కోల్పోతుంది. దానిలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలను పాటించండి. 

 • మనం స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత విషయంలో ఓ మాట గుర్తుంచుకోండి. మన శరీర ఉష్ణోగ్రత కంటే ఆ నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. మరింత ఎక్కువ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది. 
 • మీరు వాడే సబ్బు మరింత సుంగధభరితమైనది కాకుండా చూసుకోండి. మైల్డ్‌ సోప్‌లు వాడటమే మంచిది. 
 • మంచి మాయిశ్చరైజేషన్‌ లోషన్స్‌తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి. 
 • పొగతాగే అలవాటును వెంటనే మానేయాలి. పొగలోని రసాయనాలు ఏజింగ్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే మార్పులన్నీ త్వరగా వచ్చేస్తాయి. 
 • రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్‌స్క్రీన్‌ లోషన్స్‌ ఉపయోగించాలి. వారికి తగిన ఎస్‌పీఎఫ్‌ (సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌)తో ఉండే సన్‌స్క్రీన్‌ కోసం ఓసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మరింత మేలు. 
 • శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోండి. 
 • పెరుగుతున్న వయసుతో చర్మంపై ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో  యాంటీఆక్సిడెంట్స్, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఈ పోషకాలు ఎక్కువ. 
 • ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం తో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపుతో నిగారిస్తూ ఉంటుంది. 
 • మన చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్‌కు వెంటనే చికిత్స తీసుకోవాలి.  నిర్లక్ష్యం చేస్తే అవి మరింత అవి ఇతర సమస్యలకు దారితీయవచ్చు. 
 • డయాబెటిస్, థైరాయిడ్, పోషకాహారలోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు. 
 • ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం చాలా రోజులు ఏజింగ్‌ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. 
Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top